5న డిచ్ పల్లి కి కేటీఆర్, కవిత రాక..

నవతెలంగాణ  – డిచ్ పల్లి
ఈనెల 5న డిచ్పల్లి మండల కేంద్రంలోని జి కన్వెన్షన్లో జరిగే రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు, శాసనసమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత రానున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇరువురు 5న డిచ్పిల్లికి రానున్నారని తెలిపారు. కేటీఆర్ను టోల్ ప్లాజా నుండి భారీ ర్యాలీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఈ విస్తృత సమావేశానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Spread the love