బండి సంజయ్‌కి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

నవతెలంగాణ -హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించారు. తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. బండి సంజయ్ కామెంట్స్ నిరాధారమైనని, తనపై తప్పుడు ఆరోపణలని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు. తనను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశతంతోనే ఆయన కామెంట్స్‌ చేశారని నోటీసులో కేటీఆర్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసత్య ప్రచారం చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Spread the love