నవతెలంగాణ – హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి ఆండాళమ్మ మృతిపట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని దామోదర్ రావు స్వగృహంలో ఆండాళమ్మ పార్థివదేహానికి కేటీఆర్ నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దామోదర్‌రావుతో పాటు కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు.