నవతెలంగాణ – హైదరాబాద్: సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేయడంపై కేటీఆర్ స్పందించారు. ‘సోనియా గాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది. దొడ్డి దారిలో పీసీసీ చీఫ్ అయి ఇవాళ రాజీవ్ గాంధీ మీద కపట ప్రేమ చూపిస్తున్నావు. నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్లుంటది. పనికిరాని విగ్రహాలను తొలగిస్తాం’ అని ట్వీట్ చేశారు.