సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

K.taraka ramaraoనవతెలంగాణ – హైదరాబాద్:  సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మరోసారి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను, చేనేతలను ఆదుకున్నామని కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బతుకమ్మ చీరలు నేసే పనిని చేనేతలకు ఇచ్చి పని కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని పనులను క్యాన్సిల్ చేస్తోందన్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక నేతన్నలు రోడ్డున పడ్డారని తెలిపారు. చేనేతలకు పని కల్పించాలని తాను మంత్రి తుమ్మలను కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మొదలు మహేందర్ రెడ్డిలు దగుల్బాజీలు, సన్నాసులు అని కేటీఆర్  వ్యాఖ్యలు చేశారు.

Spread the love