మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: ఆత్రం సుగుణ

KTR should apologize to women: Atram Sugunaనవతెలంగాణ – జన్నారం
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం  సుగుణ డిమాండ్ చేశారు. శనివారం జన్నారం పట్టణంలో ఆమె ఏర్పాటుచేసిన పత్రిక విలేకరులతో  మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందన్నారు. ఆ పథకంపై మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. తను ఈరోజు దండేపల్లి మండలంలోని తాళ్లపేట స్టేజి నుంచి,జన్నారం వరకు బస్సులో ప్రయాణించానని, బస్సులో పలువురు మహిళలతో మాట్లాడానన్నారు.  మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆర్టీసీలో సుఖ ప్రయాణం సాగుతుందని ఆ మహిళలు తెలిపినట్లు, వారు తెలిపారు. మహిళల పట్లకేటీఆర్ అలా మాట్లాడటం సమంజసం కాదన్నారు.
ప్రతి రైతును కంటికి రెప్పలా కాపాడుకుంటాం:
ప్రతి రైతును కంటికి రెప్పలా కాపాడుకుంటామని, రుణమాఫీ విషయంలో,  రుణమాఫీ కాని రైతులు  ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు సుగుణ సూచించారు. రైతుల మేలు కోసమే ప్రభుత్వం మూడు విడతలలో రుణమాఫీ చేసిందని, ప్రతి రైతుకు తప్పనిసరిగా రుణమాఫీ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం అని, సమస్యలు ఉంటే తమకు తెలిపితే వాటిని పరిష్కరిస్తామన్నారు. రైతుల వెంట ప్రభుత్వం ఉంటుందన్నారు.రైతులు అధైర్య పడవద్దని రైతులను కోరారు కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు ముసాఫర్ అలీ ఖాన్ మేకల మాణిక్యం, మిక్కిలినేని రాజశేఖర్, ఇసాక్  మత్స్య శంకరయ్య, షాకీర్ అలీ, అరె సిరీస్, కంప సుధీర్,అన్నే  కాంతామని,లక్ష్మి,సత్తన్న,ఈర్నాల గంగన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love