నవతెలంగాణ-హైదరాబాద్ : ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు కేటీఆర్ హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారించారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం తోసిపుచ్చింది. దీంతో ఆయన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.