నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే అభ్యర్థి దళిత నాయకుడు గువ్వల బాలరాజుని(Guvwala Balaraju) పరామర్శించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్(Minister KTR). నిన్న రాత్రి అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరుల దాడిలో గాయపడి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే అభ్యర్థి దళిత నాయకుడు గువ్వల బాలరాజుని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాతూ.. గువ్వల బాలరాజు పై దాడి జరిగినట్టు తెలుస్తోందని.. దాడులు సరికావు అన్నారు. మొన్న ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి ఇప్పుడు బాలరాజు పై రాళ్ళ దాడి అంటూ ఫైర్ అయ్యారు. ప్రజలను మెప్పించాలి.. అవసరం అయితే కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగాలని చురకలు అంటించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎదైనా జరుగవచ్చు అన్నారు. కాంగ్రెస్ రౌడీలు ఇలా చేయడం దారుణమని..దళిత నాయకున్ని చేసి.. కొట్టారని ఆగ్రహించారు.