నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవరకూ సీఎం రేవంత్ రెడ్డిని వదలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. కానీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. రేవంత్, రాహుల్ మాత్రమే ఉద్యోగం తెచ్చుకున్నారు. గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలి. రాష్ట్రంలోని నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది’ అని ఆయన భరోసా ఇచ్చారు.