సీఎస్ శాంత కుమారికి లేఖ రాసిన కేటీఆర్

KTR wrote a letter to CS Shantha Kumariనవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ చరిత్ర, రాష్ట్ర ముఖ్య సమచారాన్ని వెబ్ సైట్లు, డిజిటల్ ప్లాట్ ఫామ్ ల నుంచి తీసేస్తున్నారని లేఖలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కుట్రపూరితంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తొలగించిన సమాచారమంతా తెలంగాణ చరిత్రలో అంతర్భాగమన్నారు కేటీఆర్. రాష్ట్ర చరిత్ర, ముఖ్యమైన సమాచారమంతా భవిష్యత్ తరాలకు అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. సీఎస్ స్పందించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు కేటీఆర్.

Spread the love