గెలిచిన ఎమ్మెల్యేలతో నేడు కేటీఆర్‌ సమావేశం

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం గెలిచిన ఎమ్మెల్యే లు, ముఖ్య నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ పై ఈ సందర్భంగా చర్చించనున్నారు. ఇది ఇలా ఉండగా.. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన రేవంత్ ను కలిసిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. కేటీఆర్ తాజాగా దీనిపై ఆయన స్పందించారు. ‘సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. అదంతా పచ్చి అబద్ధం. కేసీఆర్ నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తా. జై తెలంగాణ’ అని వెంకట్రావు స్పష్టం చేశారు. అటు మరికాసేపట్లో రాజ్ భవన్ కు సీఈఓ వికాస్ రాజ్ వెళ్లనున్నారు. గెలిచిన అభ్యర్థుల లిస్ట్ గవర్నర్ కు అందించనున్నారు సీఈఓ. నివేదిక అందిన తరువాత కొత్త శాసనసభ ఏర్పాటుకు విడుదల కానుంది.

Spread the love