కేటీఆర్ పాలన ధృతరాష్ట్ర కౌగిలి లాంటిది..

నవతెలంగాణ- సిరిసిల్ల
కేటీఆర్ పాలన ధృతరాష్ట్ర కౌగిలి లాంటిదని సిరిసిల్లలో కాంగ్రెస్ మేనిఫెస్టోను కేటీఆర్ కాపీ కొడుతున్నారని సిరిసిల్ల శాసనసభ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సిరిసిల్ల కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న అంశాన్ని వార్డులుగా ఏర్పాటుచేసిన విలీన గ్రామాలను తిరిగి సిరిసిల్లలోని కలుపుదామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని ఇచ్చిన హామీని కేటీఆర్ కాపీ కొడుతూ మళ్లీ ప్రజల్లోకి తీసుకుపోతున్నారని ఆయన అన్నారు. సిరిసిల్లాను అభివృద్ధి చేసిన అని చెప్పుకునే కేటీఆర్ ఇప్పుడు ఎన్నికల ముందే సిరిసిల్ల అండర్ గ్రౌండ్ అభివృద్ధి చేస్తానని ఎందుకు మాట్లాడుతున్నారని గతంలోనే చేసి ఉండొచ్చు కదా అని, కేటీఆర్ విడుదల చేసిన ఒక ఆడియో ద్వారా తను సిరిసిల్లలో వారానికి రెండు రోజులు అందుబాటులో ఉంటానని చెప్పాడు.. దీన్నిబట్టి గతంలో ఎప్పుడూ కూడా సిరిసిల్లలో అందుబాటులో లేడని అర్థమవుతుందని, గతంలో 2009లో మొదటిసారి పోటీ చేసినప్పుడు సిరిసిల్లలోని ఇల్లు కట్టుకొని కుటుంబంతో సహా ఉంటారని చెప్పిన కేటీఆర్ ఇప్పటివరకు కూడా సిరిసిల్లలో ఒక్కరోజు కూడా నిద్ర చేయలేదని అన్నారు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నాగుల సత్యనారాయణ గౌడ్ గడ్డం నరసయ్య చొప్పదండి ప్రకాష్ వైద్య శివప్రసాద్ కాముని వనిత సామల పావని ఎల్ ఏ లక్ష్మీనారాయణ మడుపు శ్రీదేవి చందన గోలి వెంకటరమణ సూర దేవరాజు వేల్మూల స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Spread the love