– ఫిలింఫేర్‌లో ఉత్తమచిత్రంగా ఎంపిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘బలగం’ ఎంపిక కావడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు (కేటీఆర్) ఆ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఆ చిత్ర దర్శకుడు వేణు యెల్దండికి శుభాకాంక్షలు చెప్పారు. బలగం సినిమా మొత్తం సిరిసిల్లలోనే చిత్రీకరణ జరుపుకుందనీ, సినీ చరిత్రలోనే ఈ చిత్రం మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. సిరిసిల్ల నేత కార్మిక కుటుంబంలో పుట్టి, సినీరంగంలో వేణు యెల్దండి రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్ధండి (బలగం), ఉత్తమ సహాయ నటిగా రూపలక్ష్మీ(బలగం)కి అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం వేణుతో పాటు అతని టీం కష్టానికి దక్కిన ఫలితంగా అభివర్ణించారు.