కుమారి శ్రీమతి..

నవతెలంగాణ- హైదరాబాద్: అలా మొదలైంది సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది నిత్యా. మొదటి సినిమాతో భారీ హిట్ ను అందుకొని వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. గ్లామర్, అందాల ఆరబోత లేకుండా స్టార్లు అవలేరని అనుకుంటున్నా జనరేషన్ లో అవేమి లేకుండానే.. స్టార్ హీరోయిన్ గా ఎదిగి అందరి మన్ననలు పొందింది. ఇక తెలుగు లోనే కాకుండా తమిళ్ లో కూడా మంచి మంచి సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న నిత్యా.. ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటించింది. గోమతేష్ ఉపాధ్యాయే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్ ను స్వప్న సినిమాస్ పై స్వప్న దత్ నిర్మించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ కోలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన కామెంట్స్ చేశారు.. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో నన్ను వేధించాడు.. తమిళ్ సినీ ఇండస్ట్రీ వల్ల నేను చాలా ఇబ్బందులను పడ్డాను.. అని చెప్పారు నిత్యా. ప్రస్తుతం నిత్య చేసిన ఈ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Spread the love