మంత్రి సీతక్కను కలిసిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి

నవతెలంగాణ – భువనగిరి రూరల్
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం సెక్రటేరియట్ లో పంచాయితీ రాజ్,  రూరల్ డెవలప్ మెంట్ మంత్రి సీతక్కను కలిసి, పెండింగ్ లో వున్న గ్రామీణ రోడ్ల నిర్మాణ పనులకు కావలసిన నిధులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా  మంత్రి సీతక్క  సానుకూలంగా స్పందించి కావలసిన నిధులను వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
Spread the love