మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు శ్రీరామ్ రెడ్డి, సోదరీ విజయలక్ష్మి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను వివరిస్తూ గడప గడప ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరు గ్యారంటీ పథకాల అమలు వలన నిరుపేద కుటుంబాలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి వలిగొండ మండలం వాసి వలిగొండ గ్రామానికి చెందిన వ్యక్తి సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుంటారన్నారు. సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తి అని గతంలో వేములకొండ గ్రామంలో ట్రాక్టర్ కాలువలో పడి మరణించిన వారికి ముందుండి సహాయం అందించిన మొదటి వ్యక్తి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, నా గ్రామశాఖ అధ్యక్షులు కో- ఆప్షన్ మెంబర్ రసూల్, పులిపల్పుల రాములు, కాసుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.