నవతెలంగాణ -వెల్డండ
మండల పరిధిలోని కుప్ప గండ్ల గ్రామానికి చెందిన టిడిపి నాయకులు , మాజీ ఎంపీటీసీ బాలకిష్టయ్య గౌడ్ గురువారం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఆయనతో పాటు మాజీ వార్డ్ సభ్యులు నారయ్య యాదవ్ పలువురు పార్టీలో చేరారు.వీరిని ఎమ్మెల్యే సాదరంగా కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మక్తాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.