కువైట్ అగ్నిప్ర‌మాదం.. 24 మంది మ‌ల‌యాళీలే

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కువైట్ లోని ఆరు అంత‌స్తుల భ‌వ‌నంలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో మృతిచెందిన వారి సంఖ్య 50కి చేరుకున్న‌ది. మంగాఫ్ బ్లాక్‌లో ఉన్న బిల్డింగ్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అయితే ఆ ప్ర‌మాదంలో మృతిచెందిన వారిలో 24 మంది కేర‌ళ వాసులు ఉన్న‌ట్లు నాన్ రెసిడెంట్ కేర‌లేట్స్ అఫైర్స్ సంస్థ ప్ర‌క‌టించింది. దీంట్లో 17 మందిని మాత్ర‌మే గుర్తించిన‌ట్లు వాళ్లు పేర్కొన్నారు. అల్ మంగాఫ్ బిల్డింగ్ అగ్నిప్ర‌మాదంలో మొత్తం 50 మంది మృతిచెంద‌గా, దాంట్లో 42 మంది భార‌తీయులే అని తేలింది. మిగితావారిలో పాకిస్థానీలు, ఫిలిప్పినో, ఈజిప్ట్‌, నేపాలీలు ఉన్నారు. కేర‌ళ వాసుల‌తో పాటు త‌మిళ‌నాడు, యూపీ రాష్ట్రాల‌కు చెందిన వారు కూడా మ‌ర‌ణించిన వారిలో ఉన్నారు. ప్ర‌స్తుతం 35 మంది ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నార‌ని, అందులో ఏడు మంది క్రిటిక‌ల్‌గా ఉన్న‌ట్లు తెలిపారు. క‌నీసం అయిదుగురు వెంటిలేట‌ర్ స‌పోర్టుపై ఉన్న‌ట్లు తేలింది.

Spread the love