
ప్రతి వసతి గృహాలలో విద్యార్థులకు జనరేటర్ ఏర్పాటు చేయాలని కేవీపీఎస్ జిల్లా నాయకులు దొంతాల నాగార్జున అన్నారు. శనివారం పెద్దవూర మండలం పులిచెర్ల గ్రామంలో ఉన్న ఎస్టీ హాస్టల్ లో ఉన్న సమస్యలను విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో హస్టల్ గదులు, మరుగుదొడ్లు, పరిసరాల నుపరిశీలించారు.అనంతరం కేవీపీఎస్ జిల్లా నాయకులు దొంతాల నాగార్జున మాట్లాడుతూ ఎస్ హాస్టల్లు సమస్యలకు వాలయాలుగా మారాయని అన్నారు. వార్డెన్లు స్థానికంగా ఉండక విద్యార్థులు తమకు ఇష్టం వచ్చినట్లు హాస్టల్లో ఉంటున్నారని వారి భవిష్యత్తును ప్రశ్నార్థకముగా తయారైందని ఆవేదన వ్యకం చేశారు.రాత్రిపూట కరెంటు పోతే విద్యార్థులు చీకట్లోనే గడిపే విధంగా ఉంటున్నారని తక్షణమే హాస్టల్లో జనరటర్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్రాగటానికి రాత్రి పూట నీళ్లు లేకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.విద్యార్థులు ఆడుకోవటానికి ఆటవస్తులు లేవని విద్యార్థులకు బాత్రూమ్స్ లేక బహిర్ భూమికి బయటకు వెళ్తున్నారని తక్షణమే అధికారులు స్పందించి విద్యార్థుల యొక్క సమస్యలను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బ కృష్ణ, సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు.