– గ్రామ కార్యదర్శులకు గుదిబండగా మారిన వైనం..
నవతెలంగాణ – రెంజల్
తెలంగాణలో సర్పంచ్ ల పాలన ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించాగా పారిశుద్ధ్య లోపం తారస్థాయికి చేరుకుంది. గ్రామపంచాయతీలలో నిధుల లేమి, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం, గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి నెట్టుకు రావడం గగనమైపోతుంది. లక్షలాది రూపాయలను అప్పులు చేసినా గ్రామాల అభివృద్ధికి తీవ్ర లోపం జరుగుతోంది. అప్పులు చేసి గ్రామంలో తాగునీరు, వీధి దీపాల ఏర్పాటు, సరిపోతుందని, గత నాలుగు ఐదు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో పలు గ్రామాలలో పారిశుధ్య కార్మికులు పనులను నిలిపివేయడంతో గ్రామాలు పారిశుద్ధంతో నిండిపోయాయి. ప్రత్యేక అధికారులు మాత్రం ఇలాగైనా గ్రామ కార్యదర్శి లే బాధ్యత వహిస్తూ, పనులను పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం తో గ్రామ కార్యదర్శిల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. పక్క మండలాల నుంచి కార్మికులను తీసుకువచ్చి పారిశుధ్య కార్మికులను చేపట్టడానికి ప్రయత్నిస్తున్న కార్యదర్శులకు పారిశుద్ధ కార్మికులు అడ్డుపడడంతో ఏమి చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పంది ంచి ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేక నిధులు కేటాయించి పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టిని సాధించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల పేరుతో పాఠశాలల మరమ్మత్తుల విషయంలో అధికారులు నిమగ్నం కాగా, పారిశుద్ధ లోపం స్పష్టంగా కనబడుతుంది. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా, మండల అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.