సర్వేపత్రాల కొరత ..

Shortage of survey papers..– ప్రతి మండలానికి 500 సర్వే పత్రాలు 
– ఒక్కొక్క ఎనిమినేటర్ కు 5 పత్రాలు 
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
ఇంటింటి సర్వే చేసి అన్నికులాల సామాజిక, ఆర్థిక తదితర అంశాలపై కచ్చితమైన లెక్కలు తీసి న్యాయం చేస్తామని కాంగ్రెస్‌ సర్కార్ హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు  భిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికి సర్వేకు అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. సర్వే చేసేందుకు ఎన్యుమరేటర్లు కు సర్వే పత్రాలు కొరత ఉండడంతో నేడు నామ మాత్రము సర్వే కొనసాగింది. ఒక్కొక్క ఎనిమినేటర్ కు 5 నుంచి 7 పత్రాలను ఇవ్వడంతో ఎన్యుమరేటర్లు ఉదయం 10 గంటల వరకే ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేశారు. ఒక్కొక్క ఎనిమినేటర్ తన పరిధిలో పది నుంచి 20 ఇండ్లు సర్వే చేయాలని ఆదేశాలు అన్నప్పటికీ, సర్వే చేసి పత్రాలు లేకపోవడంతో ఎనిమినేటర్లు చేసేది ఏమీ లేక తల పట్టుకున్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండలంలో ఇంటికి సమగ్ర సర్వే కార్యక్రమంలో సర్వేపత్రాల కొరతతో సర్వే నామ మాత్రం సాగింది. బాన్సువాడ మండలంలో 101 బ్లాక్ కు ఉండగా  91 ఎన్యుమరేటర్లకు 11 మంది సూపర్వైజర్ ఉన్నారు. మండలంలో 12065  కుటుంబాలు ఉన్నాయి, నసురుల్లాబాద్ మండలంలో ఏప్రిల్ 79 బ్లాక్ కు  65 ఎన్యుమరేటర్లు ఉన్నారు.
వీరికి  7 సూపర్వైజర్ ఉన్నారు. బీర్కూర్ మండలంలో 69 బ్లాక్ లకు 67 ఎన్యుమరేటర్లు ఉన్నారు. వీరికి 7 సూపర్ వైజర్ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేసే ప్రభుత్వ ఉద్యోగులను ఎన్యుమరేటర్లుగా ఏర్పాటు చేసి ఇంటింటికి సర్వే చేస్తున్నారు. సర్వే ప్రారంభం నుంచి ఏదో ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి.  ఇంటింటికి గుర్తింపు కోసం  ఇంటింటికి సర్వే స్టిక్కర్ ఒకరోజు అంగన్వాడి టీచర్లు గ్రామ కార్యదర్శి , బూత్ లెవెల్ ఆఫీసర్లు కారోబార్లు కలిసి ఇంటింటికి వెళ్లి స్టిక్కర్ వేశారు. మరుసటి రోజు స్టిక్కర్లు వేయడం నిలిపివేయ చేశారు. ఇంటింటి సర్వేలో భాగంగా ఎనిమినేటర్లు 6 నుండి 8 వరకు ఇంటింటికి తిరుగుతూ కుటుంబ యజమాని ఆధార్ నెంబర్తో ఇంటికి స్టిక్కర్ వెయ్యడం కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి ఇంటికి వెళ్లి సర్వే చేయవలసి ఉండగా నేడు ఎనిమిది గంటలకు సర్వేపత్రాలు నామామిత్రంగా అందడంతో సర్వే మధ్యాహ్నం వరకు ముగించారు. బాన్సువాడ మండలానికి 500 సర్వే పత్రాలు రాగా ఒక్కొక్క ఎనిమినేటర్ కు ఐదు చొప్పున పత్రాలను అందజేశారు. అలాగే నసురుల్లాబాద్  మండలం లో 500 సర్వే పత్రాలు రాధా ఒక్కొక్క ఎన్ని గంటలకు ఏడు చొప్పున పత్రాలను అందజేశారు. బీర్కూర్ మండలంలో 67 ఎనిమిది గంటలకు గాను 500 సర్వే పత్రాలు రాగా ఒక్కొక్కరికి ఏడు చొప్పున అందజేశారు. దీనితో చేసేదేమి లేక  మధ్యాహ్నం వరకు సర్వే చేశారు. జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర కుటుంబ సర్వే పత్రాలను ప్రతి మండలానికి 500 చొప్పున పంపిణీ చేయడంతో నేడు ఒక్కొక్క ఎనిమినేటర్ కు 5 పత్రాలను ఇవ్వడం జరిగిందని బాన్సువాడ డివిజన్ అధికారి తెలిపారు.
Spread the love