లక్ష్మయ్య మరణం తీరని లోటు

– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎన్‌ సబిత
నవతెలంగాణ-ఘట్కేసర్‌
పోచారం పురపాలక సంఘ పరిధిలో అన్న నగర్‌లో కొంతకాలంగా సీపీఐ(ఎం) సీనియర్‌ సభ్యుడిగా కొనసాగుతు న్న వి లక్ష్మయ్య అనారోగ్య ంతో అకాల మరణం చెందటం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పార్టీ మండల కార్యదర్శి ఎన్‌ సబిత అన్నారు. శనివారం ఆయన నివాసం వద్ద లక్ష్మయ్య మతదేహానికి పార్టీ మండల కమిటీ సభ్యులతో కలిసి పూల మాలలు వేసి నివాళులర్పించారు .అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం జరిగిన ఉద్యమాల్లో లక్ష్మయ్య ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. ఆయన మరణం సీపీఐ(ఎం)కు ప్రజాఉద్యమాలకు తీరని లోటని చెప్పారు. పార్టీ మండల కమిటీ సభ్యులు ఎన్‌ దాసు, జి. నాగమణి నరసింహ, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love