మేడారం ప్రధాన పూజారి మృతి

నవతెలంగాణ -తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరిగే సమ్మక్క-సారక్క మహా జాతర పూజారి సిద్ధబోయిన లక్ష్మణ్ రావు(48) అనారోగ్యంతో గురువారం ఉదయం మృతి చెందారు. గత నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించి చికిత్స అందించారు. అనంతరం ఇంటి వద్దనే ఉంటూ మందులు వాడుతున్నాడు. రెండు రోజుల క్రితం నుంచి లక్ష్మణరావు జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. పూజారి లక్ష్మణరావు కు భార్య అనిత, పిల్లలు సౌమ్య, నితిన్ లు ఉన్నారు. పూజారి లక్ష్మణరావు మృతి విషయం తెలుసుకున్న గిరిజన స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చుతూ ప్రకటన విడుదల చేశారు.
అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు
మేడారం సమ్మక్క సారలమ్మ ప్రధాన పూజారి సిద్ధబోయిన లక్ష్మణరావు మృతి తెలుసుకున్న అధికారులు ప్రజాప్రతినిధులు మృత దేహం వద్దకు చేరుకున్నారు. పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, స్థానిక తాసిల్దార్ తోట రవీందర్, ఎండోమెంట్ ఈవో రాజేంద్రం,  హనుమకొండ బ్రాంచ్ ఎల్ఐసి ఏబీఎం చేల సత్యం, మాజీ మేడారం టెస్ట్ బోర్డ్ చైర్మన్ కాక లింగయ్య, స్థానిక సర్పంచ్ చిడం బాబురావు, పూజారి సిద్ధబోయిన స్వామి, కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు పీరీల వెంకన్న, ఎండోమెంట్ అధికారులు పాల్గొని పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన అంతిమయాత్ర శుభయమానంగా జరిగింది. గ్రామంలోని గ్రామ పెద్దలు, ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధలు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love