నవతెలంగాణ నిజాంసాగర్: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవిని ఇవ్వాలని నిజాంసాగర్ మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూక్కల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి ఇవ్వలేరని దీని ద్వారా నియోజకవర్గం విద్యలో గాని, వైద్యంలో గాని, అభివృద్ధిలో గానీ, వెనుకబడి ఉందని ఆయన అన్నారు. లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇస్తే దేశమంతా జుక్కల్ నియోజకవర్గము వైపు చూసేలా అభివృద్ధి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. కావున అధిష్టానం ఆలోచించి ఒక్కసారి నియోజకవర్గానికి మంత్రిని ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.