– ఎమ్మెల్యేగా మార్కెట్ కమిటీకి మొట్టమొదటిసారి వచ్చిన లక్ష్మీకాంతరావుకు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఘన సన్మానం
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో పత్తి కొనుగోళ్ల బిట్ల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేగా గెలుపొందిన తోట లక్ష్మి కాంతారావు మొట్టమొదట మార్కెట్ కమిటీకి విచ్చేసినందున ఎమ్మెల్యేకు మార్కెట్ కమిటీ తరఫున మార్కెట్ కమిటీ కార్యదర్శి విటల్ శాలువతో ఘనంగా సత్కరించి బొక్కేను అందజేస్తూ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ స్వాగతించారు. ఈ స్వాగత కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మద్నూర్ జుక్కల్ మండలాల్లోని వివిధ గ్రామాల అధికార పార్టీ సర్పంచులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.