నవతెలంగాణ – ఆర్మూర్
వైయస్సార్ టిపి బాల్కొండ నియోజకవర్గ మహిళా సంఘ అధ్యక్షురాలుగా పెసురోల్ల లక్ష్మి నియమించినట్టు నియోజకవర్గం కోఆర్డినేటర్ పిప్పెర లావణ్య సోమవారం తెలిపారు. జిల్లా పరిశీలకులు రామ చందర్ , జిల్లా అధ్యక్షులు గౌతం ప్రసాద్ గారి సూచనల మేరకు బాల్కొండ నియోజక వర్గ కో ఆర్డినేటర్ పిప్పెర లావణ్య వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బాల్కొండ నియోజకవర్గ మహిళా సంఘ అధ్యక్షురాలుగా పెసురోల్ల లక్ష్మి నియమించడం జరిగింది.నియామక పత్రాలను వైయస్సార్ తెలంగాణ పార్టీ నియోజకవర్గం పిప్పెర లావణ్య గారు అందజేయడం జరిగింది.అనంతరం కోఆర్డినేటర్ పిప్పెర లావణ్య మాట్లాడుతూ నియోజవర్గంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ,ఆదరణ చూస్తే వచ్చేది రాజన్న రాజ్యమే అని ధీమా వస్తుంది.ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణ యుగంగా పరిపాలించాడు ఆ యుగం రావాలంటే రాజన్న బిడ్డ అయిన షర్మిలమ్మ తోనే సాధ్యమని ప్రజలంతా షర్మిలమ్మకు ఒక అవకాశం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.