హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పోలీసుల బదిలీలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో పెద్ద ఎత్తున పోలీసుల బదిలీలు జరిగాయి. నగర పోలీస్ కమిషనర్ పరిధిలో 353 ఎస్ఐలు, 370 మంది హెడ్ కానిస్టేబుల్ ,1471 మంది కానిస్టేబుల్, 186 ఏఎస్ఐలను బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగర పోలీస్ కమిషనరేట్ల లో పనిచేస్తున్న అన్ని విభాగాలలో ఈ బదిలీలు జరిగాయి. ఇప్పటికే సీఐల బదిలీ చేసిన విషయం తెలిసిందే.

Spread the love