లక్డికాపూల్‌లో లారీ బోల్తా..భారీగా ట్రాఫిక్‌ జామ్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌ : కంటైనర్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే..మూసాపేట్‌ నుంచి కాటేదాన్ వెళ్తున్న లారీ లక్డికాపూల్‌ టర్నింగ్‌ వద్దకు రాగానే బోల్తా పడింది. ఈ ప్రమాంలో డ్రైవర్‌, క్లీనర్‌కు స్పల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో రోడ్డుపై రద్దీ లేకపోవడంతో వాహనదారులకు పెను ప్రమాదం తప్పింది. కంటెనైర్‌ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలను మరో రూట్లో మళ్లించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love