నవ్వించే.. పాపం పసివాడు

Laughing.. Sinful babyఆహా నుంచి ‘పాపం పసివాడు’అనే కామెడీ వెబ్‌ సిరీస్‌ తెలుగు ప్రేక్షకులను పలకరించుంది. వీకెండ్‌ షో రూపొందించిన దీని ట్రైలర్‌ను దర్శకుడు సందీప్‌ రాజ్‌ రిలీజ్‌ చేశారు. ఐదు ఎపిసోడ్స్‌ ఉన్న ఈ ఫన్‌ రైడర్‌ ఈనెల 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సిరీస్‌లో సింగర్‌ శ్రీరామ చంద్రతో పాటు గాయత్రి చాగంటి, రాశీ సింగ్‌, శ్రీవిద్య మహర్షి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సందర్భంగా గాయకుడు శ్రీరామ చంద్ర మాట్లాడుతూ,”ఆహా’లో యాంకర్‌గా నా జర్నీ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సిరీస్‌తో యాక్టర్‌గా మారాను. ఇది ఓ వైపు ప్రేమ, మరో వైపు కామెడీ కలయికతో సాగే ఒరిజినల్‌. ఈ సిరీస్‌ను ప్రతీ ఒక్కరూ ఎంజారు చేస్తారు’ అని చెప్పారు.

Spread the love