ఆద్యంతం నవ్విస్తుంది

Laughs all the way throughఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం-1గా రూపొందిన చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్‌ జంటగా నటించారు. జయ శంకర్‌ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్‌ గజేంద్ర నిర్మాతలు. ఈనెల 24న ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు రవి పొలిశెట్టి, మహేంద్ర మీడియాతో మాట్లాడుతూ, ‘మేం తెలంగాణలో పుట్టి, పెరిగాం. అమెరికాలో బిజినెస్‌ చేస్తూ ఫ్రెండ్స్‌ అయ్యాం. సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో ప్రొడ్యూసర్స్‌గా మారాం. దర్శకుడు సంజరు శేరి చెప్పిన స్టోరీలో ఇన్నోసెంట్‌ కామెడీ ఉంది. పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌తో 28 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. అవుట్‌ పుట్‌ చాలా బాగా వచ్చింది. ప్రెజెంటర్‌గా ఉన్న జయశంకర్‌ మాకు చాలా సపోర్ట్‌ చేశారు. కంప్లీట్‌ ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. సినిమాలో కామెడీ ఉంటే అమెరికా ప్రేక్షకులు బ్లాక్‌ బస్టర్‌ చేస్తారు. ఇక్కడ 100 థియేటర్లో విడుదల చేస్తుంటే యూఎస్‌లో మాత్రం 150 ప్లస్‌ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఇన్నోసెంట్‌ అయితే మనీ మేకింగ్‌ ఎలా చేస్తారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్‌. ఫాస్ట్‌గా రిచ్‌ అయిపోవడానికి వాళ్ళిద్దరూ ఏం చేశారనేది హిలేరియస్‌గా ఉంటుంది. బిట్‌ కాయిన్‌ కాన్సెప్ట్‌తోనూ ఫన్‌ జనరేట్‌ చేశాం. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్‌ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి. కంప్లీట్‌ క్లీన్‌ కామెడీతో రాబోతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది’ అని తెలిపారు.

Spread the love