హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) సికింద్రాబాద్‌లో మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు సంబంధించిన వెల్త్ హబ్‌ను ఏర్పాటు చేసింది. శనివారం దీనిని హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్, ఎస్‌బిఐ కార్పోరేట్ సెంటర్ ముంబయి సిజిఎం (వెల్త్ అండ్ ప్రీమియర్ బ్యాంకింగ్) సుఖిందర్ కౌర్ లాంచనంగా ప్రారంభించారు. దేశంలో ఎస్‌బిఐ వెల్త్ ప్రస్తుతం 102 ప్రధాన నగరాల్లో 232 వెల్త్ హబ్స్‌ను కలిగి ఉంది. అధిక ఆదాయం కలిగిన 3,75,000 క్లయింట్లకు సర్వీసును అందిస్తుంది. దాదాపు రూ.3 లక్షల కోట్ల ఎయుఎంను కలిగి ఉంది.
2024 మార్చి ముగింపు నాటికి 4.50 లక్షల క్లయింట్లతో రూ.4 లక్షల ఎయుఎంకు చేరాలని లక్ష్యంగా పెట్టుకుందని రాజేష్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లో ఇది తమకు 12 హెల్త్ హబ్ అని తెలిపారు. అధిక ఆదాయాలు కలిగిన క్లయింట్లకు ప్రత్యేక సర్వీసులను అందించడమే వీటి లక్ష్యమని పేర్కొన్నారు. ప్రముఖ ఫండ్ సంస్థల నుంచి అధిక ఆదాయాలు కలిగిన వారికి అన్ని కేటగిరీల్లో ఆకర్షణీయ ప్రొడక్ట్స్‌ను అందిస్తున్నామన్నారు. ఎన్‌ఆర్‌ఐల కోసం కొచ్చిలోనూ గ్లోబల్ ఇ-వెల్త్ సెంటర్‌ను ప్రారంభించినట్లు ఎస్‌బిఐ తెలిపింది.