ఉత్తేజకరమైన కొత్త టైల్స్ ఉత్పత్తుల శ్రేణిని ఆవిష్కరించినది..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐకానిక్ బాత్‌వేర్ అండ్ టైల్స్ బ్రాండ్ అయిన హిండ్‌వేర్ లిమిటెడ్, ఇటీవల టైల్ అదేసివ్ రంగంలో అడుగుపెట్టినట్లు మరియు టైల్స్ విభాగంలో అది అందించే ఉత్పత్తులను విస్తరించినట్లు ప్రకటించినది. సిరామిక్ నుండి ఎలివేషన్ టైల్స్ వరకు మొత్తం టైల్ విభాగానికి సేవలందించడం కోసం అదేసివ్స్ లో 5 విభిన్న ఎస్‌కెయులను ప్రారంభించినది. ఈ వ్యూహాత్మక చర్యతో, వినియోగదారులకు వారి నిర్మాణం మరియు ఇంటి మెరుగుదల అవసరాల కోసం అవసరమైన అన్ని పరిష్కారాలను ఒకే చోట అందించుటను బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణ రంగంలో విశ్వసనీయమైన అదేసివ్ సొల్యూషన్స్ కోసం పెరుగుతున్న డిమాండ్ కారణంగా, టైల్ అదేసివ్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మార్కెట్ యొక్క సామర్థ్యాన్ని గుర్తిస్తూ, హిండ్‌వేర్ టైల్స్ నిర్మాణ సామాగ్రి రంగంలో తన నైపుణ్యాలను వినియోగిస్తూ, తన ప్రస్తుత పోర్ట్‌ఫోలియోకు తగిన సంబంధం కలిగి ఉండే టైల్ అదేసివ్ సొల్యూషన్స్ అందించాలని భావిస్తున్నది. ఈ వ్యూహాత్మక చర్య ద్వారా, వినియోగదారులకు వారి టైలింగ్ అవసరాలన్నింటి కోసం వన్-స్టాప్ షాప్ అందించుటను హిండ్‌వేర్ టైల్స్ లక్ష్యంగా పెట్టుకుంది. అదేసివ్ రంగంలోకి హిండ్ వేర్ ప్రవేశించడం గురించి వ్యాఖ్యానిస్తూ, శ్రీ సుధాంశు పోఖ్రియాల్, సిఇవో ఆఫ్ బాత్ అండ్ టైల్స్, హిండ్‌వేర్ లిమిటెడ్ గారు, “టైల్స్‌లో తన ప్రధాన సామర్థ్యం మరియు వాటిని ప్రభావవంతంగా అమర్చడం కోసం అవసరమైన అదేసివ్ ఉత్పత్తుల యొక్క కాంప్లిమెంటరీ స్వభావం మధ్య సినర్జీని హిండ్‌వేర్ గుర్తిస్తుంది. ఈ వ్యూహాత్మక కలయిక ఒక పరిపూర్ణ పరిష్కారాన్ని అందించడం ద్వారా వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా వారి టైలింగ్ అవసరాలన్నింటి కోసం మమ్మల్ని ఒక వన్-స్టాప్ గమ్యస్థానంగా నిలబెడుతుంది.” అన్నారు. ఇంకా, “ఈ కొత్త టైల్స్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో ప్రారంభించుట అనేది వినియోగదారుల-కేంద్రిత బ్రాండ్ గా తమకున్న పేరును మరింత బలోపేతం చేయడంతో పాటుగా విస్తరిస్తున్న ప్రీమియం టైల్స్ మార్కెట్ లో ఒక గణనీయమైన వాటాను కైవసం చేసుకోవడంలో హిండ్‌వేర్ యొక్క ముందుచూపును సూచిస్తుంది. ఉత్పత్తులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండుటను నిర్ధారిస్తూ, ప్రస్తుత హిండ్‌వేర్ టైల్స్ పంపిణీదారులు మరియు రిటైల్ నెట్‌వర్క్ ద్వారా అందుబాటులో ఉంటాయి.” అని కూడా అన్నారు. అదేసివ్స్ మరియు గ్రౌట్స్ యొక్క ఈ ప్రత్యేకమైన ఉత్పత్తి శ్రేణిని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ డీలర్ల సమావేశంలో శ్రీ పంకజ్ మెడిరట్టా, వైస్ ప్రెసిడెంట్, సేల్స్ హిండ్‌వేర్ టైల్స్ గారు ఆవిష్కరించారు. ఈ ఈవెంట్ కు భారతదేశ వ్యాప్తంగా ఉన్న 200లకు పైగా డీలర్లు హాజరయ్యారు. టైల్స్ అదేసివ్ రంగంలో ఇది ప్రవేశించడంతో పాటు, హిండ్‌వేర్ టైల్స్ కొత్త టైల్స్ శ్రేణిని ప్రారంభించడం ద్వారా ప్రస్తుత ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించినది. వీటిలో భాగంగా ఉన్నవి — 600×1200 mm కొలతల్లో GSVT టైల్స్ మ్యాటీ గ్లాస్ మరియు వెనీర్ వంటి గొప్ప ఫినిష్ లను అందిస్తున్నవి, బహుముఖమైన 300×600 mm సైజులో GVT ఎలివేషన్, ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ క్లాడింగ్ సొల్యూషన్స్ కోసం పెరుగుతున్న ప్రాధాన్యతలను అనుగుణంగా సేవలందిస్తున్నాయి మరియు ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ ప్రాజెక్ట్ ల కోసం హై డెప్త్ ఎలివేషన్ టైల్స్ ను అందిస్తున్నాయి. తన ప్రత్యేకమైన టైల్స్ శ్రేణిలో భాగంగా, సొగసును జోడించడానికి మరియు డైనింగ్ రూమ్, పడకగదులు మరియు లివింగ్ రూమ్స్ వంటి మీకు ఇష్టమైన ప్రదేశాలు ఇతరుల దృష్టిని ఆకర్షించేలా చేయడానికి విలాసవంతమైన 800×1600 mm సైజులో ఈ బ్రాండ్ కార్పెట్ టైల్స్ ను కూడా ఆవిష్కరించడం జరిగింది. కాంబినేషన్ టైల్స్ గ్లాస్ మరియు కార్వింగ్ ఫినిషెస్ యొక్క అభిరుచితో కూడిన కలయికను అందిస్తూ, ఒక ఏకవర్ణ దృశ్యపు ఆకర్షణీయతను ఏర్పరుస్తున్నాయి, అలాగే రోబస్టో సిరీస్ రూపం మరియు పనితీరు యొక్క పరిపూర్ణ కలయికను అందిస్తూ, అద్భుత సౌందర్యాన్ని కలిగి ఉంటూనే అధిక రద్దీ ఉండే ప్రదేశాల యొక్క ఆచరణాత్మక అవసరాలను తీర్చుతున్నవి. హిండ్‌వేర్ టైల్స్ భారతదేశంలో ధృడమైన రిటైల్ మరియు పంపిణీదారుల నెట్‌వర్క్ ను కలిగి ఉంది, భారతదేశ వ్యాప్తంగా వ్యూహాత్మకంగా 200లకు పైగా నగరాలను కవర్ చేస్తూ, 50 బ్రాండ్ స్టోర్ లతో 500+ లకు పైగా డీలర్ లను కలిగి ఉంది.

Spread the love