నవతెలంగాణ – హైదరాబాద్: మస్తాన్ సాయి తనపై లైంగికదాడి చేశాడంటూ లావణ్య ఇటీవల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మస్తాన్ సాయి తల్లిదండ్రులు గుంటూరులోని మస్తాన్ దర్గాలో ధర్మకర్తలుగా పనిచేస్తున్నారని, వారిని పదవి నుంచి తొలగించాలంటూ ఏకంగా గవర్నర్‌కు లేఖ రాసింది. వాళ్ళ కొడుకు క్రిమినల్ కేసులో శిక్ష అనుభవిస్తుండగా, వారు ఎలా అలాంటి ఉన్నతమైన పదవిలో ఉంటారంటూ పేర్కొంది.