పోలీసు దాడికి నిరసనగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు

– న్యాయవాద రక్షణ చట్టం డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
సిద్దిపేట బార్ అసోసియేషన్ సభ్యుడు,న్యాయవాది రవి కుమార్ పై స్థానిక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమా రెడ్డి భౌతిక దాడి చేయడంపట్ల తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపుమేరకు నిజామాబాద్ న్యాయవాదం నేను విధులను బహిష్కరించి జిల్లా కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. న్యాయవాదిపై దాడిని భారత్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుందని దాడి  శోచనీయమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ పేర్కొన్నారు. కాక్షిదారుని బెయిలు లో జామానథు పేపర్లు సమర్పించడానికి వెళ్లిన సమయంలో కావాలని కాలయాపన చేయించడం ఒక నేరమైతే వచ్చిన వెంటనే న్యాయవాది పై మ్యాన్ హ్యాండిల్ చేయడం మరొక నేరమని జగన్ తెలిపారు. న్యాయవాదిపై భౌతిక దాడి చేసిన పోలీసు అధికారి ఉమారెడ్డి వెంటనే సర్వీస్ నుండి సస్పెండ్ చేయాలని సదరు అమానుష నేరంపై న్యాయవిచారన జరిపి చట్ట ప్రకారం శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. యావదులపై ఇటీవల జరిగిన దాడుల దృశ్యం ప్రత్యేక న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని బాధ్యులైన పోలీస్ విధుల నుంచి తొలగించి వారిపై నమోదు చేయాలని చట్టపర చర్యలు తీసుకొని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి పిండం రాజు, సంయుక్త కార్యదర్శి వసంతరావు, కోశాధికారి దీపక్, లైబ్రరీ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు మాణిక్ రాజ్, ఎర్రం విగ్నేష్, సీనియర్ న్యాయవాది ఎర్రం గణపతి, గొర్రెపాటి మాధవరావు, టి గంగాధర్, అల్గొట్ రవీందర్, శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు కవితా రెడ్డి, విశ్వక్సేన్ రాజ్, ఆరేటి నారాయణ, పులి జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love