ప్రభుత్వ ఉద్యోగాలలో హ్యాట్రిక్ వీరుడు లక్ష్మణ్ 

నవతెలంగాణ – నవీపేట్
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గగనమైన ఈ రోజుల్లో ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అహో అని ఆశ్చర్య చకితులను చేశాడు. నవీపేట్ మండలంలోని కోస్లి గ్రామానికి చెందిన మేతరి లక్ష్మణ్. తండ్రి మేతరి లక్ష్మన్న, తల్లి గంగవ్వ లది వ్యవసాయ కుటుంబం.  ఏడుగురు సంతానంలో చివరివాడైన లక్ష్మణ్ కుటుంబంలో చదువుకున్నవారు పెద్దగా ఎవరు లేకపోయినా పట్టుదలగా ఎంఏ బీఈడీ చదివాడు. 2014 నుండి ఎంట్రెన్స్ రాసేందుకు సిద్ధమైన నోటిఫికేషన్ లేకపోవడంతో దశాబ్ద కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఇటీవల గురుకుల బోర్డు విడుదల చేసిన ఫలితాలలో వారం రోజుల వ్యవధిలోనే జేఎల్, పిజిటి, టీజీటీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి హ్యాట్రిక్ వీరుడిగా నిలిచాడు. క్రమశిక్షణ, అంకితభావం మరియు సాహసమే లక్ష్యంగా చదవడంతోనే సాధ్యమైందని భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని మేతరి లక్ష్మణ్ తెలిపారు. తల్లిదండ్రులతో పాటు భార్య నిత్యశ్రీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
Spread the love