నవతెలంగాణ – హైదరాబాద్: ఎల్‌బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఎల్‌బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనర్ ఆఫీస్‌కు పది అడుగుల దూరంలో యాచకురాలు హత్యకు గురైంది. ఆమె గొంతు కోసి చంపారు గుర్తు తెలియని దుండగులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. యాచకురాలిని హత్య చేసిన దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.