నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆర్ధికంగా ఏ స్థాయిలో ఉన్న ఆర్ధిక వ్యవహారాల్లో అక్షరాస్యత, ఆదాయ లావాదేవీల్లో సమతుల్యమైన అవగాహన ఎంతైనా అవసరం అని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వి.రామిరెడ్డి అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో స్థానిక విద్యార్దులకు అసోసియేట్ డీన్ అద్యక్షతన ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎల్డీఎం రామిరెడ్డి ఆర్ధిక వ్యవహారాలు, లావాదేవీల్లో అప్రమత్తత, పెరుగుతున్న సైబర్ క్రైం నుండి జాగ్రత్తలు పై విద్యార్ధులు కు అవగాహన కల్పించారు. ఆర్ధిక కౌన్సిలర్ వి.బాబూరావు ఆర్థిక అక్షరాస్యత ఆవశ్యకత, ప్రాముఖ్యత, ఆర్ధిక వ్యవహారాల్లో లోటుపాట్లు,ఆర్ధిక సమస్యలు పై అవగాహన కల్పించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విద్యార్దులకు అందజేస్తున్న వివిధ అవకాశాలను వివరించారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత కుమార్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరికి నిత్యజీవితంలో ఆర్థిక యాజమాన్యం ఎంతో అవసరం అని,బాధ్యతగా వ్యవహరిస్తూ చిన్న చిన్న పొదుపు లు చేయడం ద్వారా జీవితంలో ఎంతో ఆర్ధిక మార్పును సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్స్ శ్రావణ్ కుమార్,కే.శిరీష,ఐ.క్రిష్ణ తేజ్ లు పాల్గొన్నారు.