రాజకీయ యుద్ధభేరికి తరలిన పద్మశాలి సంఘం నాయకులు    

నవతెలంగాణ- తాడ్వాయి 
తాడ్వాయి మండలం నుంచి పద్మశాలి సంఘం నాయకులు ఆదివారం కోరుట్ల కు తరలి వెళ్లారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కోరుట్లలో నిర్వహించబోయే పద్మశాలి యుద్ధభేరి సభకు వెళుతున్నట్లు వారు తెలిపారు. పద్మశాలీలు రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం కావాలని వారు కోరారు. నాయకులు పద్మశాలీలను రాజకీయంగా అణిచివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పద్మశాలీలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు సాయిబాబా, కృష్ణమూర్తి, అరవింద్, స్వామి తదితరులు పాల్గొన్నారు
Spread the love