కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిసిన సిద్దిపేట నేతలు

నవతెలంగాణ-గజ్వేల్‌
తెలంగాణ జన సమితి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కోదండరాంను సిద్దిపేట టీజేఎస్‌ నేతలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారుడు మలిదశ ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియామకాలు చేపకట్టకపోవడం, నిధులను ఒకే కుటుంబానికి సమకూర్చుకొని దోచుకుందన్నారు. విద్యార్థుల మరణాలకు కారకులైన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా కో కన్వీనర్‌ ప్రవీణ్‌ యూత్‌ విభాగ అధ్యక్షులు దుబ్బాక స్వామి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love