ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన నాయకులు 

నవతెలంగాణ – బొమ్మలరామారం
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్యేగా విజయం సాధించిన తీన్మార్ మల్లన్నను మంగళవారం బొమ్మలరామారం మండల కాంగ్రెస్ నాయకులు జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రాజేశ్వర్ యాదవ్, సింగల్ విండో మాజీ చైర్మన్ మోకు మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ చీర సత్యనారాయణ, ముద్దం శ్రీకాంత్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, ప్రవీణ్ యాదవ్, సురేందర్ రెడ్డి, నరేందర్ నాయక్, రాజమల్లారెడ్డి, కృష్ణారెడ్డి, బాలకృష్ణ, బాలకృష్ణ యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love