దుర్గామాత శోభయాత్రలో పాల్గొన్న నాయకులు

నవ తెలంగాణ- తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ప్రతిష్టించిన  దుర్గాదేవి అమ్మవారు నవరాత్రులుగా విశిష్ట పూజలు అందుకుని, భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అలంకరణలతో పూజలు అందుకున్న అమ్మవారి  శోభాయాత్ర గురువారం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న దుర్గామాత  భారీ ఊరేగింపు ద్వారా కోలాటాలు, డప్పులు, నృత్యాల ద్వారా పాత బస్తీ. తెలంగాణ చౌరస్తా మీదుగా స్థానిక పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  యెల్సోజు నరేష్. ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్   వర్కింగ్ ప్రెసిడెంట్ జుమ్మి లాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంకేపల్లి కొండల్ రెడ్డి, పేరాల వీరేష్, రాపాక సోమేశ్, కందుకూరి విశ్వేశ్వర్, వై నవీన్ తో పాటు పలువురు వ్యాపారులు  పాల్గొన్నారు.

Spread the love