త్రాగునీటి సరఫరా చేసే పైప్ లైన్ లీకేజీ 

Leakage of pipe line supplying drinking water– పరిశీలించిన నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేసే అలీసాగర్ లిఫ్ట్ పైప్ లైన్ లీకేజీ ఏర్పడింది. ఈ మేరకు మంగళవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ మకరందు పైప్ లైన్ ను పరిశీలించారు. పైప్లైన్ పనులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే లిఫ్ట్లో నీళ్లు ఉన్నాయని ఖాళీ కాగానే మరమ్మతులు చేపడతామని అధికారులు ఆయనకు వివరించారు. బుధవారం వరకు పనులు పూర్తి చేయాలని తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మకరంద్ మాట్లాడుతూ.. పైప్ లైన్  మరమ్మతులు పూర్తయ్యే వరకు నగరవాసులకు ఇబ్బందులు కలుగకుండా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలియజేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 17 ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిస్తున్నామని వివరించారు. ఇంకా ఎవరికైనా తాగునీటి సమస్య ఉంటే వెంటనే మున్సిపల్ సిబ్బందిని సంప్రదిస్తే ట్యాంకర్ల ద్వారా పంపుతామని చెప్పారు. పైప్ లైన్ పనులు బుధవారం పూర్తయ్యే అవకాశం ఉందని, గురువారం నుంచి యథావిధిగా తాగునీటి సరఫరా కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ మకరంద్ తెలిపారు.

Spread the love