ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్  నేర్చుకోవాలి..

– కరాటే గ్రీటింగ్ టెస్టింగ్ ..
– మున్సిపల్ వైస్ ఛైర్మన్ బింగి మహేష్   
నవతెలంగాణ – వేములవాడ రూరల్
ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్  నేర్చుకోవాలి..మార్షల్ ఆర్ట్స్ లో రాణించాలి అని మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నారు బుధవారం వేములవాడ పట్టణంలోని మహా లింగేశ్వర గార్డెన్ లో ఒ కినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే గ్రీటింగ్ టెస్టింగ్  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ చూపిన విద్యార్థులకు బెల్టులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బింగి మహేష్  మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహిస్తున్న  తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని అన్నారు. ప్రతిభ కనబరిచి బెల్టులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.  ప్రస్తుత సమాజంలో ప్రతీ ఒక్కరు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని, బాలికలు తప్పనిసరి నేర్చుకోవాలన్నారు. మార్షల్ ఆర్ట్స్ తో ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, చదువులో చురుకుగా రానిస్తారని తెలిపారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించడం పట్ల మాస్టర్ అబ్దుల్ మన్నాన్  అభినందించారు. కార్యక్రమంలో  కరాటే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కరాటే మాస్టర్  అబ్దుల్ మన్నాన్, కరాటే కోచర్ కనికరపు రాకేష్, బ్లాక్ బెల్ట్ గ్రహీతలు  అప్సర్, ప్రతాప రిషిక్ తేజ, గుడిసె విజయ్ కుమార్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Spread the love