నవతెలంగాణ – బీరూట్ : శుక్రవారం బీరూట్‌లో లెబనాన్‌లోని ఐక్యర్యాసమితి అంతర్గత బలగం (యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్) కాన్వారుపై దాడి జరిగింది. ఈ దాడిలో యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్ డిప్యూటీ ఫోర్స్ కమాండర్‌కి గాయాలయ్యాయి. ఐక్యరాజ్యసమితి అంతర్గత బలగాల్ని బీరూట్ విమానాశ్రయానికి తీసుకువెళుతున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లో భద్రతను పునరుద్ధరించడానికి పనిచేస్తున్న శాంతి పరిరక్షకులపై ఇలాంటి దాడి జరగడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ ప్రకటన పేర్కొంది. అయితే ఈ దాడిని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ శనివారం ఖండించారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే భద్రతా బలగాలు సహించబోవని రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.