పేసర్‌ శ్రీశాంత్‌కు లీగల్‌ నోటీసు

Sreesanthనవతెలంగాణ – హైదరాబాద్: మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌, పేసర్‌ శ్రీశాంత్‌ మధ్య నెలకొన్న వాగ్వాదం మరో మలుపు తీసుకుంది. సోషల్‌ మీడియాలో గంభీర్‌ను లక్ష్యంగా చేసుకుని, చేస్తున్న పోస్టులను తక్షణమే తొలగించాలని శ్రీశాంత్‌కు లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ) కమిషనర్‌ లీగల్‌ నోటీసులు ఇచ్చాడు. ఈనెల 6న ఇండియా క్యాపిటల్స్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ మ్యాచ్‌సందర్భంగా ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సంభాషణలో గంభీర్‌ తనని ఫిక్సర్‌ అన్నాడని శ్రీశాంత్‌ సోషల్‌ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశాడు. అంతేకాక గంభీర్‌ అహంకారి అని శ్రీశాంత్‌ మరో పోస్టు చేశాడు. శ్రీశాంత్‌ను గంభీర్‌ ఫిక్సర్‌ అన్నట్టు ఎలాంటి వీడియో ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని ఎల్‌ఎల్‌సీ తెలిపింది. శ్రీశాంత్‌ ఆ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు తొలగించాక, అతడితో చర్చిస్తామని పేర్కొంది.

Spread the love