Leo Movie : తొలిరోజే వంద కోట్లు..

నవతెలంగాణ హైదరాబాద్: భారీ హైప్‌తో దసరా విడుదల ధమాకాలో విడుదలైన చిత్రం లియో(Leo Movie). రిలీజ్‌కు ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలతో ఒక హైప్‌ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా LCUలో భాగంగా తెరకెక్కిందా లేదా అన్న క్యూరియాసిటీతోనే సగం జనాలు థియేటర్‌లకు వెళ్లారు. ఇక నిన్న భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా అందరి అంచనాలను అందుకోవడంలో కాస్త తడబడింది. ఖైదీ, విక్రమ్ సినిమాల రేంజ్‌లో ఊహించుకున్న అభిమానులకు ఈ చిత్రం నిరాశే మిగిల్చింది. అయితే యాక్షన్‌ సీన్లు మాత్రం హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయని సంతృప్తి అభిమానుల్లో ఉంది.
టాక్‌ ఎలా ఉన్నా సినిమాకు మాత్రం భీభత్సమైన కలెక్షన్‌లు వచ్చాయి. ఎన్నడూ లేని విధంగా తెలుగులో విజయ్‌ సినిమాకు కండ్లు చెదిరే ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఇక లియో సినిమా (Leo Movie) తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ.100 కోట్ల మార్క్‌ దాటేసింది. రజనీ కాంత్ తర్వాత తొలిరోజు వంద కోట్లు కొల్లగొట్టిన హీరోగా విజయ్‌ రికార్డు సృష్టించాడు. అంతకుముందు కబాలి, రోబో 2.0 సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో చేరాయి. విజయ్‌ క్రేజ్‌తో పాటు LCU హైప్‌ కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమాకు దాదాపు రూ.15 కోట్ల కలెక్షన్‌లు వచ్చాయి. ఒక డబ్బింగ్ హీరో సినిమాకు అది కూడా దసరా పండగ సీజన్‌లో ఈ రేంజ్‌లో కలెక్షన్‌లు వచ్చాయంటే మాములు విషయం కాదు. ఈ సినిమా జోరు చూస్తుంటే ఫస్ట్ వీకెండ్‌లోపే బ్రేక్ ఈవెన్‌ కంప్లీట్ చేసుకుని లాభాల పట్టనున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకొచ్చిన డివైడ్‌ టాక్‌ కలెక్షన్‌ల మీద ఏమైనా ప్రభావం చూపుతుందో చూడాలి మరి. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్‌ స్వరాలు సమకూర్చారు.

Spread the love