కారుపై పెద్దపులి దాడి..

నవతెలంగాణ – అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు  జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె సమీపంలో నెల్లూరు-ముంబయి హైవేపై కారుపై పెద్దపులి దాడి చేసింది. ఒక్కసారిగా పెద్దపులి దాడి చేయడంతో కారులోని ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే వారంతా సురక్షితంగా ఉన్నారని సమాచారం. పెద్దపులి సంచారంతో మర్రిపాడు మండలంలోని అటవీప్రాంత గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

 

Spread the love