నవతెలంగాణ – డిచ్ పల్లి
లేగదూడపై చిరుతపులి పంజా విసిరింది .ఈ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ తెలిపిన వివరాల ప్రకారం ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని యానంపల్లి గ్రామ శివారులో తోట మనోజ్ కుమార్ కు చెందిన పశువుల కొట్టంలో లేగ దూడ పై మంగళవారం తెల్లవారు జామున చిరుత పులి దాడి లేగ దూడ ను చంపి వేసిందన్నారు. ఉదయం కోట్టం వద్దకు వెళ్లిన మనోజ్ కుమార్ చూసేసరికి లేగదూడ మరణించి కళేబరం ఉండడంతో యజమాని వెంటనే అటవీ సెక్షన్,బీట్ అధికారులు వినయ్, శ్రీకాంత్ లకు జరిగిన ఘటనా వివరించారు.వేంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిశితంగా పరిశీలించారు.ఈ విషయమై ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ మాట్లాడుతూ చిరుత దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. లేగ దూడ మృతి విషయమై కేసు నమోదు చేసుకున్న మని, ప్రభుత్వం నుండి నష్టపరిహారాన్ని అందించే విధంగా చుస్తనని అయన వివరించారు. కాగా చిరుత సంచరిస్తున్న వార్తతో చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు,స్థానిక రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎప్పుడైనా దాన్ని అనవాళ్లు కంటికి కనబడ్డ వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేయాలని ప్రజలకు రైతులకు సూచించారు.