కార్మిక-శ్రామిక-కర్షక పక్షపాతి అర్జున్ గెలిపించండి…

– బూర్జువా,పెట్టుబడి దారులకు నియోజకవర్గ సమస్యల పట్ల కనీస అవగాహన లేని వారికి ఓట్లడిగే హక్కు లేదు
– అశ్వారావుపేట నియోజకవర్గ సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి కామ్రేడ్ పిట్టల అర్జున్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి
– కొక్కెరపాటి పుల్లయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
నవతెలంగాణ – అశ్వారావుపేట : నియోజక వర్గ కేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయం అయిన  సుందరయ్య భవన్ లో మండల కమిటీ సభ్యులు సోడెం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ మండల మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  కామ్రేడ్ కొక్కెరపాటి పుల్లయ్య హాజరై మాట్లాడారు.ప్రజాసంఘాలు బలపర్చిన సిపిఐ(ఎం) అభ్యర్థి కామ్రేడ్ పిట్టల అర్జున్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో కమ్యూనిస్టులకు ప్రాధాన్యం ఉండాలని,అప్పుడే కార్మిక – శ్రామిక – కర్షక గొంతుక శాసన సభలో వినబడుతుందని ఈ సందర్భంగా అన్నారు.ఈ ఎన్నికల్లో బీజేపీకి జిల్లాలో ఒక్క సీటు కూడా రాకుండా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రజల సమగ్రాభివృద్ధికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదన్నారు.ఈ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాట నిర్వహించింది సిపిఐ(ఎం) పార్టీయే నని అన్నారు.అర్జున్  విద్యార్థి వయస్సులోనే వామపక్షాలు నిర్వహించే ప్రజా ఉద్యమాలకు ఆకర్షితుడైనాడనీ,25 యేండ్లు ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించిన సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. కార్మికవర్గ నాయకుడిగా ఆశాలు,అంగన్ వాడీలు,హమాలీలు, గ్రామపంచాయతీ వర్కర్స్, బిల్డింగ్ వర్కర్స్ ,వివోఏ – ఐకేపి లు,పామాయిల్ గెలలు కోత కార్మికుల సమస్యలపై అపార అనుభవం కల్గిన వ్యక్తన్నారు. డబ్బు,అవకాశవాద రాజకీయాలు,పార్టీ ఫిరాయింపు దారులను ఓడించాలని అన్నారు.
అశ్వారావుపేట మండలంలో అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీ కొట్లాడిందనీ, ప్రత్యేకంగా పోడు సాగుదారుల సమస్యల పరిష్కారం కోసం విశేషమైన కృషి చేసిందన్నారు.ప్రజా సమస్యలపై పాలక వర్గాలను నిలదీసే సిపిఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని,స్వచ్చమైన రాజకీయాలు చేసే వారికి పట్టం కట్టాలని, సిపిఐ(ఎం) అభ్యర్థిని అసెంబ్లీకి పంపాలని కోరారు. ఈ‌ సమావేశంలో మండల కార్యదర్శి చిరంజీవి,అభ్యర్ధి పిట్టల అర్జున్,మండల కమిటీ సభ్యులు గడ్డం సత్యనారాయణ,మడిపల్లి వెంకటేశ్వరరావు,తుట్టి భద్రం,తగరం జగన్నాధం,కలపాల భద్రం తదితరులు పాల్గొన్నారు.
Spread the love