నవతెలంగాణ – హలియా
ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మతోన్మాద బీజేపీని, రాష్ట్రాన్ని అప్పలపాలు చేసిన బిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కుందూరు వెంకటరెడ్డి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అవుతా సైదులు పిలుపునిచ్చారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో రఘువీర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ 11, 12 వార్డులలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 15 ల బీజేపీ పాలనలో దేశ అప్పు రెండింతలుగా పెరిగిపోయిందని, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న మోడీ, అనేక పరిశ్రమల మూతకు కారణమయ్యారని, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్లకు కొమ్ముగాసే విధంగా కార్మిక చట్టాల సవరణ చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు తెలంగాణలో మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ముంచారని ఆవేదన వ్యక్తపరిచారు. కమిషన్ల కోసమే కాలేశ్వరం నిర్వహించి ఫోన్ టాపింగ్ లతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ గడిళ్ల పాలన కొనసాగించారని, ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి ఇండియా కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీపీఐ(ఎం) నాయకులు చింతల చంద్రారెడ్డి, కత్తి శ్రీనివాస్ రెడ్డి, ఎస్కే బషీర్, శ్రీహరి చెరుపల్లి ముత్యాలు వెంకటేశ్వర్లు మాలకొండయ్య కారంపూడి ధనమ్మ పొదల వెంకన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు.